డుంబ్రిగూడ: సమస్యలు పరిష్కరించాలని వినతి
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం 104 సిబ్బంది తహసీల్దార్, మండల పరిషత్తు కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు జగదీష్, రాకేష్ మాట్లాడుతూ. 104లో ఉద్యోగులుగా ఉంటూ గిరిజన ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అరబిందో యాజమాన్యంపై అప్పగించడంతో ఇబ్బందులు పడ్డామన్నారు. ఇప్పటికి మూడు నెలలుగా వేతనాలు లేక కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.