దిబ్బిడి లో ఘనంగా మరిడమాంబ తల్లి ఒడ్డు పండుగ

72చూసినవారు
బుచ్చయ్యపేట మండలం దిబ్బిడి గ్రామంలో గురువారం మరిడిమాంబ తల్లి ఒడ్డు పండుగ స్థానిక సర్పంచ్ పేదిరెడ్ల మాణిక్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గ్రామస్తులు, పేదిరెడ్ల వంశీయులు, మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో పండుగ వేడుకల్లో పాల్గొని పశుపు కుంకుమలు, చీర, జాకెట్ సమర్పించారు. మధ్యాహ్నం అన్న దాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైస్ ఎంపీపీ గొంపా చినబాబు, మాజి సర్పంచ్ గొంపా అప్పారావు తదితరులు అమ్మ వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్