బుచ్చియ్యపేట ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు

78చూసినవారు
బుచ్చియ్యపేట ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు
బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా జి. శ్రీనివాసరావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. కాగా ఈయన అల్లూరి సీతారామ జిల్లా జి. మాడుగుల పోలీస్ స్టేషన్ నుండి సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎస్ఐ గా విధులు నిర్వహించిన డి. ఈశ్వరరావు అనకాపల్లి పట్టణ స్టేషన్ కి బదిలీపై వెళ్లారు. శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

సంబంధిత పోస్ట్