అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం పాలమామిడి కేంద్రంలో మంగళవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మత్స్యరాస మాణి కుమారి పాలమామిడి పంచాయతీ మాజీ సర్పంచ్ గెమ్మెలి లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ
ఎన్టీఆర్ స్త్రీలకు పురుషులతో సమానంగా ఆస్తిలో హక్కు కల్పిస్తే చంద్రబాబు మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా చైతన్యం తెచ్చారు. రాజమహేంద్రవరం లో జరిగిన మహానాడులో మేనిఫెస్టోలో స్త్రీలకు మేలు కలిగే మహా శక్తి ద్వారా స్త్రీలకు మరింత మేలు జరుగుతుంది అన్ని మత్స్యరాస మణి కుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా విజయ రాణి, మాజీ జడ్పీ చైర్మన్ వంజంగి కాంతమ్మ, పాలమామిడి పంచాయతీ మాజీ సర్పంచ్ గెమ్మెలి లక్ష్మి టి. ఎన్ ఎస్. ఎఫ్ మాజీ జిల్లా నాయకులు నాయుడు త్రినాధ్ పాల్గొన్నారు.