ABC జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ABC జ్యూస్ అంటే A అంటే ఆపిల్, B అంటే బీట్‌రూట్, C అంటే క్యారెట్. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉండే విషం బయటకు పోతుంది. అలసట నుండి ఉపశమనం కలుగుతుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జీర్ణ సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది.