ఏపీలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలో విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. పెదబయలు మండలం గుడుగుపల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. ఇంటిపైన బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.