అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులు ఆదేశాలు మేరకు సోమవారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25 న ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అనే ప్రాణాంతక వ్యాధి నివారించుటకు జీకే వీధి సబ్ యూనిట్ అధికారి ఆర్. కన్నబాబు, ఉప సర్పంచ్ మడపల సోమేష్ కుమార్,సబ్ సెంటర్ ఏఎన్ఎం ఎల్. భాగ్యలక్ష్మి,హెల్త్ అసిస్టెంట్ ఎం.సత్యనారాయణ,ఆశా కార్యకర్తలు ఆధ్వర్యంలో రింతాడ గ్రామంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. జీకే వీధి సబ్ యూనిట్ అధికారి ఆర్.కన్నబాబు ర్యాలీ పాల్గొని సీజనల్ వ్యాధులు, దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోదకాలు మొదలగు వ్యాదులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ, దోమల నివారించుటకు దోమతెరలు వాడాలి. ప్రతి ఇంటిలో బయట లోపల దోమల మందు పిచికారి చేసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు త్రాగాలి. ప్రతి శుక్రవారం ఫ్రైడే- డ్రై డే కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.