మాడుగుల: గిరిజనేతరుల పేరు మీద పట్టాల రద్దు చేయాలి
గిరిజనేతరల పేరు మీద ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చీడికాడ మండలం కోణం ఆదివాసీలు చీడికాడ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఆదివాసి సంఘం గౌరవ సలహాదారు పిఎస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, కోణం సర్వే నంబర్ 275, 287లలో 17 ఎకరాల 78 సెంట్లు సీలింగ్ మిగులు భూమి ఉన్నదని, ఈ భూమిని తరతరాలుగా గుంటి శివారు గ్రామానికి చెందిన ఆదివాసీలు సాగు చేస్తున్నారన్నారు.