పది రోజులుగా మాడుగుల ముఖం చూడని బస్సులు
సుమారు పది రోజులుగా మాడుగుల గ్రామానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వడ్డాది విజయరామరాజుపేట మధ్యన తాజేరు బ్రిడ్జి వద్ద కాజువే కొట్టుకు పోవడంతో నాటి నుంచి నేటి వరకు బస్సులు రాలేదు. దీంతో మాడుగుల నుంచి వివిధ ప్రాంతాలకు ఇచ్చు రాకపోకలు సాగించేవారు.. అత్యావసర పనుల మీద బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలన్నారు.