రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుమార్తె రేష్మిత చిన్న వయసులో పెద్ద మనసు చాటుకున్నారు. గురువారం విజయవాడ ప్రాంతంలో అజిత్ సింగ్ నగర్లో సర్వం కోల్పోయిన మహిళలకు 50 చీరలతో పాటు నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పులు, అరటి పళ్ళు పంపిణీ చేశారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా రేష్మిత మాట్లాడుతూ. తన వంతుగా కొందరు బాధితులకు సాయం అందించానని అన్నారు.