యలమంచిలి
ఎలమంచిలి: కేర్ టేకర్ ను శిక్షించాలి
ఎలమంచిలి మండలం లైను కొత్తూరు న్యూలైఫ్ వసతి గృహంలో 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేర్ టేకర్ పై సమగ్ర విచారణ నిర్వహించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా శిక్షించాలని ఎస్ఎఫ్ఎ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఎస్ఎఫ్ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ, డివిజన్ కార్య దర్శి మణికంఠ, అధ్యక్షుడు కేశవ ఎలమంచిలి తహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించాలన్నారు.