అనకాపల్లి: కూతుళ్లతో కలిసి డ్యాన్స్ చేసిన తల్లి

53చూసినవారు
కవల పిల్లలతో కలిసి ఓ తల్లి డాన్స్ చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆసక్తికర సంఘటన అనకాపల్లి జిల్లాలోని జల్లూరు జెడ్పిహెచ్ఎస్ లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో జరిగింది. 'ఆకాశంలో ఆశల హరివిల్లు' అని సాగే పాటకు ఆమె అలవోకగా డాన్స్ చేశారు. పాటకు తగ్గ స్టెప్పులు వేస్తూ అందరిని ఉత్సాహపరిచారు. తన స్టెప్పులకు అందరూ చప్పట్లు, ఈలలతో ఎంకరేజ్ చేస్తుంటే ఆ తల్లి మురిసిపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్