అనకాపల్లి: రాష్ డ్రైవింగ్ కు భారీ జరిమానా విధించిన ఎస్ఐ

80చూసినవారు
అనకాపల్లి: రాష్ డ్రైవింగ్ కు భారీ జరిమానా విధించిన ఎస్ఐ
మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న భారీ వాహనానికి మునగపాక పోలీసులు భారీ జరిమానా విధించారు. అనకాపల్లి టూ అచ్యుతాపురం రోడ్డులో గురువారం అతివేగంతో వెళుతున్న లారీ ఎస్ఐ ప్రసాదరావు కంటపడింది. ఆ లారీని ఛేజ్ చేసి పట్టుకుని 68 వేల రూపాయలు జరిమానా విధించారు. అధిక వేగంతో వెళ్లడమే కాకుండా ఓవర్ లోడ్ కలిగి ఉండడం విశేషం. ఈరోడ్ లో భారీ వాహనాలు వెళ్లడం నిషేధిస్తూ ఆర్అండ్ బీ అధికారులు హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్