అనంతగిరి: రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తుల ఇక్కట్లు

83చూసినవారు
అనంతగిరి: రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తుల ఇక్కట్లు
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయితి నక్కులమామిడి అనే గ్రామానికి ఇప్పటికి డోలిమోత కాలినడక తప్పట్లేదు. వివరాల్లోకి వెళ్తే.. నక్కులమామిడి గ్రామంలో సుమారుగా 50 కుటుంబాలు ఉన్నాయి. నేటి వరకు ఆ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేనందున చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే అత్యవసర సరుకులు తెచ్చుకోవాలన్న, అలాగే గర్భిణి స్త్రీలను వైద్యశాలకు తీసుకు వెళ్లాలన్న డోలిమోతతో తరలించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించి తమ సమస్యను తీర్చాలని నక్కులమామిడి ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్