అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతగిరి మండలంలోని వాలసీ పంచాయతీ గ్రామాల్లో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వార్డు సభ్యుడు సాంబే. లచ్చన్న కోరారు. గురువారం ఆయన వాలసి పంచాయతీ పరిధి 14 గ్రామాల్లో సందర్శించి పొలాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. వర్షాలకు 300 ఎకరాల వరి పంటలు దెబ్బ తిన్నయన్నారు. అధికారులు గుర్తించి రైతులకు పరిహారం అందేలా చూడాలి కోరారు.