అనంతగిరి మండలంలోని కోనాపురానికి వెళ్లే రహదారికి మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 30 సంవత్సరాల క్రితం నిర్మించిన తారురోడ్డు శిధిలావస్థకు చేరి అద్వానంగా తయారైంది. దీనితో గ్రామంలోని గిరిజనులు వినియోగించే వృధా నీరు రహదారిపై నిలిచిపోయి బురదమయంగా మారడంతో వాహనచోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శుక్రవారం తెలిపారు. రహదారి మరమ్మతు కొరకు అధికారులు స్పందించాలని కోరారు.