అరకులోయలోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద సోమవారం వేళకు బస్సులు రాక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అరకు బస్ స్టేషన్ నుంచి ప్రయాణికులు విశాఖకు వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. కాగా విశాఖకు వెళ్లే ఆర్టీసీ బస్సులు వేళకు రాక రెండు మూడు గంటలకోసారి బస్సు రావడంతో బస్సులో ఇబ్బందులు పడి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు ప్రయాణికులు వాపోయారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించాలన్నారు.