అరకులోయ మన్యం గ్రామాల్లో రాగి పంట నూర్పులు ముమ్మరంగా సాగుతున్నాయి. వాస్తవానికి ఏజెన్సీ గ్రామాల్లో డిసెంబర్ నెల చివరిలో రాగి పంట నూర్పులు పూర్తయ్యేవి. అయితే డిసెంబర్ నెలలో తుఫాన్ కారణంగా వర్షాలు కురవడంతో రాగి పంట నూర్పిడికి వాతావరణం అనుకూలించలేదు. అందువలన జనవరి నెల వరకు రాగి పంట నూర్పులు కొనసాగే పరిస్థితి నెలకొందని మండలంలోని గన్నెల లోతేరు అమలగుడ తదితర గ్రామాల గిరిజనులు శుక్రవారం తెలిపారు.