అరకులోయ మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయతీ పరిధి నిశానిగుడ గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం నేతలు జగన్నాథ్ మగ్గన్న హరి గురువారం రాత్రి డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. నిశానిగుడ గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రుల్లు బైకు దొంగతనాలు, అలాగే మూగజీవాల దొంగతనాల బెడద ఎక్కువైందన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు పంచాయితీ పాలకులు స్పందించాలని వారు కోరారు.