అరకు: కుష్టు వ్యాధిపై ఇంటింటా సర్వే

72చూసినవారు
అరకు: కుష్టు వ్యాధిపై ఇంటింటా సర్వే
అరకులోయ మండలంలోని బస్కీ పంచాయతీ పరిధి జాకరవలస తదితర గ్రామాల్లో మాడగడ పీహెచ్సిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది మంగళవారం కుష్టు వ్యాధి గుర్తింపుపై ఇంటింటా సర్వే నిర్వహించారు. ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందర్నీ క్షుణ్ణంగా పరీక్షించారు. లక్షణాలను త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా నివరించవచ్చన్నారు. కుష్టు వ్యాధిని గుర్తించే లక్షణాల కరపత్రాలను గిరిజనులకు అందజేసి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్