అరకులోయ మండలంలోని గిరిజన మ్యూజియం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన గిరిజన సాంప్రదాయమైన థింసా నృత్యం ఆకట్టుకుంది. దేశంలోని నలుమూలల నుంచి గిరిజన మ్యూజియాన్ని సందర్శించేందుకు వచ్చిన పలువురు పర్యాటకులు చిన్నారులు ప్రదర్శించిన థింసా నృత్యాన్ని తిలకించి ఫిదా అయ్యారు. అయితే అరకులోయ మన్యంలోని గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకో వారం రోజులపాటు ఈ సంబరాలు కొనసాగనున్నాయి.