అరకులోయలో చలి తీవ్రత ప్రజలను వణికిస్తోంది. గత వారంలో కురిసిన వర్షాల తర్వాత అరకులోయ మన్యంలో చలి తీవ్రత మరింత పెరిగింది. దీంతో ప్రజలు చలి తీవ్రతను తట్టుకునేందుకు ఉన్ని దుస్తులు ధరించి ఉదయం సాయంత్రం 9 గంటల వరకు చలి మంటలు కుంపటీలు వేసుకొని ఇండ్లకే పరిమితమవుతున్నారు. రాత్రి సమయాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రయాణించడం కష్టతరంగా తయారైంది. చలికి చిన్నారులు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెపుతున్నారు.