డుంబ్రిగుడ మండలంలోని గసభ పంచాయతీ పరిధి కంగారుసొల గ్రామంలో గురువారం ఇటీవల నిర్మాణం చేపట్టిన నూతన రచ్చబండను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ పాంగి సునీత ఎంపిటిసి బలరాం ఉపసర్పంచ్ మహాదేవ్ పాల్గొని కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ. రచ్చబండ ప్రారంభంతో గిరిజనుల రచ్చబండ కష్టం తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ మాజీ సర్పంచ్ సురేష్ కుమార్ సత్యనారాయణ గోపాల్ తదితరులున్నారు.