జి. మాడుగుల: మద్దిగరువులో ఒక అరటి చెట్టుకి రెండు గెలలు

74చూసినవారు
అరటి చెట్టుకి ఒక్క గెల మాత్రమే ఉంటుంది. జి. మాడుగుల మండలంలోని మద్దిగరువులో ఓ గిరిజన రైతు వేసిన అరటి తోటలో ఒక అరటి చెట్టుకు 2 గెలలోచ్చాయి. అరటి గెలల పొడవు సుమారు 3 అడుగుల వరకు ఉంది. ఇలా 2 గెలలు రావడం చూసి చుట్టుపక్కల ప్రాంతాల గిరిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉద్యానవన శాఖ అధికారిని సంప్రదించగా సహజంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు కవలలు ఎలా పుడతారో అలానే చెట్టు గర్భం నుంచి 2 గెలలోస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్