కొయ్యూరు మండలం దొడ్డవరం గ్రామ శివారులలో అక్రమంగా నిల్వ ఉంచిన 74 తంగేడు దుంగలను స్వాధీనం చేసుకుని కాకరపాడుకలప డిపోకు తరలించినట్లు పెదవలస అటవీ రేంజ్ అధికారిణి శివరంజని శుక్రవారం తెలిపారు. తమ సిబ్బందితో కలిసి సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా దొడ్డవరంలో సుమారు 17 వేలు విలువ చేసే తంగేడు దుంగలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించామన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని కాకరపాడు అటవీ కలప డిపోకు తరలించామన్నారు.