ముంచంగిపుట్టు మండలంలోని కుమడ పంచాయతీలోని ససిర్లిమెట్టలో నివాసముంటున్న వికలాంగుడు అనాధ బాలుడు వంతల. చిట్టిబాబుకు ఆధార్ కార్డు లేదు. దీనితో చిట్టిబాబుకు 10 సంవత్సరాలుగా పింఛన్ రేషన్ రావడం లేదు. దీనితో స్థానికులు ఆదరణ సేవ ట్రస్ట్ సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె స్పందించి సమస్య పరిష్కారానికి తాహాసిల్దార్ ను కోరారు. చిట్టిబాబుకు ఆధార్ కార్డు సోమవారం అందజేశారు. ఇందులో సాధురం అనిత సంజన తదితరులున్నారు.