భీమిలి ప్రభుత్వ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలను పండగలా ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం హైస్కూల్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వందేళ్లు పూర్తి చేసుకున్న హైస్కూల్స్ చాలా అరుదుగా ఉంటాయన్నారు. ఆ ఖాతాలో భీమిలి హైస్కూల్ చేరడం గర్వకారణమని తెలిపారు. శతాబ్ది ఉత్సవాలను ఆశీర్వదిస్తూ ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం పంపించారన్నారు.