తమిళనాడులోని పుదుక్కోట్టైకి చెందిన 14 మంది మత్స్యకారులను శనివారం శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) దాటి పాక్‌స్ట్రెయిట్‌లోని నెడుంతీవు సమీపంలో చేపలు పట్టడంతో వారు అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల మూడు బోట్లను కూడా సీజ్ చేశారు. కాగా, ఈ అరెస్టులను నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అక్కడి ప్రజలు చేపల వేట కోసం సముద్రంలోకి ప్రవేశించడం గురించి ఆందోళన చెందుతున్నారు.