భీమిలీ రెవిన్యూ డివిజనల్ అధికారిగా కె. సంగీత్ మధుర్ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ ను సాయంత్రం తన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కాలెక్టర్ గా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చారు.