విశాఖ జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం హైవే వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆనందపురం నుంచి పెందుర్తి వైపు వెళ్లే రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇరు డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు ప్రథమ చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.