బుచ్చయ్యపేట: వడ్డాది బ్రాహ్మణవీధిలో భారీ అన్నసమారాధన

64చూసినవారు
బుచ్చయ్యపేట మండలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పలు గ్రామాల్లో దేవీ మండపాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. వడ్డాదిలోని బ్రాహ్మణ వీధిలో పొగాకు వర్తక సంఘం ఆధ్వర్యంలో కనక దుర్గాదేవి మండపం వద్ద భారీ అన్న సమారాధన జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి, అన్నప్రసాదం స్వీకరించారు. గ్రామ పెద్దలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్