చోడవరం నియోజకవర్గం రావికమతం మండల ప్రజలకు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు రాజాన కొండ నాయుడు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు బుధవారం తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని.. సంక్రాంతి మంచి క్రాంతి కావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం రావికమతం మండలం గుడ్డిప గ్రామ తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.