చోడవరం ఉషోదయ హైస్కూల్ లో సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ విద్యాసంస్థలు చైర్మన్ జె. రమణ జి.. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించగా.. కళాశాల బీన్ ఎస్ వి వాసు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, భోగి మంటలు వేసి, ముగ్గుల పోటీలు, పతంగుల పండుగ నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు పాల్గొని అందమైన ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి బహుమతులు ప్రధానం చేశారు.