చోడవరం: మతిస్థిమితం లేని వ్యక్తిని కుటుంబ సభ్యులకి అప్పగింత

72చూసినవారు
చోడవరం: మతిస్థిమితం లేని వ్యక్తిని కుటుంబ సభ్యులకి అప్పగింత
బీహార్ రాష్ట్రం నలంద జిల్లాకు కు చెందిన ఎండి టౌఫీక్ గత కొంతకాలంగా చోడవరం మండలంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. చోడవరం పోలీసులు ఇతడిని గమనించి చిరునామా వివరాలు అడిగి తెలుసుకుని బీహార్లో కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులను చోడవరం పోలీస్ స్టేషన్ కు రప్పించి వారికి ఆ వ్యక్తిని అప్పగించారు. బీహార్ నుండి వచ్చిన కుటుంబ సభ్యులు చోడవరం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్