రావికమతం మండలంలో గల వివిధ గ్రామాల్లో ఉన్న మా భూముల పట్టాలు రద్దుచేసి రాజకీయ నాయకులకు గిరిజనేతరులకు ఇచ్చారని, తక్షణమే ఆ పట్టాలు రద్దు చేయాలనీ, తిరిగి మా పట్టాలు పునరుద్ధరణ చేయాలని కోరుతూ సోమవారం రావికమతం మండల మండల పరిషత్ కార్యాలయం పబ్లిక్ గ్రీవెన్స్ వద్ద వద్ద ఆదివాసి గిరిజన 5వ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం ఉప తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.