అనకాపల్లి జిల్లా చోడవరం ఎడ్ల వీధిలో రెండు టవర్స్ ట్యాంకర్లు ఉన్నాయి. వాటికి వెళ్లే మార్గంలో ప్రధానమైన పైపులైను ధ్వంసం కావడంతో వాటర్ ట్యాంకులకు నీరు ఎక్కడం లేదని స్థానికులు వాపోతున్నారు. చోడవరం పట్టణ ప్రజలకు అందించే తాగునీరు పూర్తిస్థాయిలో అందలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. త్రాగునీరు పైపులు నుండి లీకేజ్ అవుతుంటే పట్టించుకోకపోవడం విచారకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.