ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విశాఖ డైరీ అవినీతి, అక్రమాలపై విచారణ కోసం ప్రత్యేక హౌస్ కమిటీని నియమించారు. నవంబర్ 20న శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ కమిటీ ఏర్పాటుకు అడుగు పడినట్లు స్పీకర్ శుక్రవారం తెలిపారు. కమిటీ చైర్మన్ గా జ్యోతుల నెహ్రూ, కమిటీ సభ్యులుగా బొండ ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, ఆర్. వి. ఎస్. కే. కె. రంగారావు, దాట్ల సుబ్బరాజును నియమించారు.