విశాఖలోని నగరం రెడ్డి కంచరపాలెం ప్రాంతంలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు పోలారెడ్డికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి ఆనందిని తీర్పు ఇచ్చారు. అలాగే నిందితుడికి రూ. 21వేల జరిమానా విధించింది. 2023 ఆగస్టు 24న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.