ఎన్నో అనర్థాలకు దారితీసే ప్లాస్టిక్ వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ మహమ్మారి వల్ల కలిగే దుష్ప్రయోజనాలను గుర్తించాలని, దానికి దూరంగా ఉంటే కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలన్నారు. స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్లాస్టిక్ నిషేధం, ఇతర కార్యాచరణపై మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు.