కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 10న తలపెట్టిన రాస్తారోకో కు అఖిల భారత యువజన సమాఖ్య( ఏఐవైఎఫ్) పూర్తి మద్దతు తెలుపుతుందని విశాఖ జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కెంగువ అచ్యుత్ రావు ఆదివారం తెలిపారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్. డి కుమార స్వామి ఉక్కు ను సమర్ధవంతంగా నడపడానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు.