మాడుగుల మండలం జాలంపల్లి గ్రామానికి చెందిన మొల్లి మణికంఠ అనే మహిళ విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతుండగా సోమవారం వి ఎఫ్ ఏ గుడాల శ్రీను వెళ్లి పెన్షన్ అందజేసినట్టు ఎండిఓకే అప్పారావు తెలిపారు. అలాగే జెడిపేటకు చెందిన పర్రె లక్ష్మి కూడా విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ చొప్ప కౌశిక్ వెళ్లి పెన్షన్ అందజేసినట్టు ఎండిఓ తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు.