విద్యార్థుల్లోనూ ఉపాధ్యాయులను పోటీతత్వం అలవాడాలని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచించారు. శనివారం మాడుగుల జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రానున్న రోజుల్లో నూతన విద్యా విధానం ద్వారా అనేక మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. విద్యార్థులు ఏ సబ్జెక్టులో పరీక్ష తప్పితే దానికి ఉపాధ్యాయులు జవాబు దారిగా ఉండాలన్నారు.