నక్కపల్లి మండలంలో ప్రభుతం వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో సేకరించిన సాగు భూములకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు డిమాండ్ చేశారు. నష్ట పరిహారం చెల్లించకుండా అధికారులు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నట్లు విమర్శించారు. దీనిపై ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కు గురువారం వినతి పత్రం అందజేశారు.