నర్సీపట్నం దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 3వ తేదీ నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని మున్సిపల్ కౌన్సిలర్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనయుడు రాజేష్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన మంగళవారం ఆలయం వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.