విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో శుక్రవారం పోరుబాట నిర్వహించారు. గురుద్వార్ జంక్షన్లో ధర్నా నిర్వహించిన అనంతరం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయాల వద్దకు చేరుకుని అధికారులకు విద్యుత్ చార్జీలను తగ్గించాలని మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వెంకట కుమారి, ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పాల్గొన్నారు.