విశాఖ జిల్లా వడ్లపూడి రజకవీధిలో నూతన సంవత్సరం వేడుకలు విషాదానికి దారితీశాయి.బుధవారం కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి కేక్ కట్ చేస్తూ శివ క్రాకర్ వెలిగించాడు. క్రాకర్ అనుకోకుండా బ్లాస్ట్ కావడంతో శివ నుదుటి భాగానికి తీవ్ర గాయమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని తక్షణమే ఆసుపత్రికి తరలించినా, వైద్యులు ఆ ప్పటికే మరణించాడని నిర్ధారించారు. హడావిడిగా ప్రారంభమైన వేడుకలు ఒక్కసారిగా కన్నీటి సముద్రంగా మారాయి. .