డంబ్రిగూడ.. పేదపాడులో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మించాలి.

71చూసినవారు
డంబ్రిగూడ.. పేదపాడులో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మించాలి.
దుంబ్రిగూడ మండలం కొర్రా పంచాయితీ పెదపాడు పి వి టి జి గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మించాలని వైసీపీ మండల నాయకుడు ఎస్ బి బాలరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో కలసి మాట్లాడుతూ గ్రామంలో వీధి కాలువలు, సిసి రోడ్లు లేకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు మురుగు నీరు అంత వీధుల్లో నిలువ ఉండిపోతుందన్నారు. దీనివల్ల పలు రకాల వ్యాధులుతో గ్రామస్తులు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్