జికే. వీధి: పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

58చూసినవారు
అల్పపీడన ప్రభావంతో గూడెంకొత్తవీధి మండలంలోని కురిసిన వర్షాలకు గాలికొండ పంచాయితీ పరిధి గ్రామాల్లో పంటలు నష్టపోయిన రైతులను పరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు గురువారం కోరారు. వారు మాట్లాడుతూ.. 2 వారాల నుంచి కురిసిన వర్షాలకు కాఫీ వరి మినుములు పెసరలు రాజ్మా చిక్కులు పంటలు దెబ్బతిన్నాయన్నారు.  తమకు నష్టం వాటిల్లిందని.. కూటమి ప్రభుత్వం స్పందించి తమకు పరిహారం ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్