గూడెంకొత్తవీధి: ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు

76చూసినవారు
గూడెంకొత్తవీధి: ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు
గూడెంకొత్తవీధి మండల పరిధిలో సోమవారం ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని రింతాడ పంచాయతీ పరిధి ముల్లుమెట్టకి చెందిన గిరిజనులు ఆటోపై ఒడిశాలోని చిత్రకొండకు బందువుల ఇంటికి వెళ్తుండగా ముల్లుమెట్ట సమీపంలోని ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలు కాగా మరో ఇద్దరూ చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. దీనితో ఇద్దరు చిన్నారులను 108లో చింతపల్లి ఏరియా తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్