కోటవురట్ల: ప్రజా దర్బార్ ను సద్వినియోగం చేసుకోవాలి

50చూసినవారు
హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం నక్కపల్లిలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు విజ్ఞప్తి చేశారు. గురువారం కోటవురట్లలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా కోటవురట్ల మండలానికి చెందిన ప్రజలు సమస్యలపై అర్జీలను హోంమంత్రికి సమర్పించవచ్చునని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్